Home Page SliderTelangana

పెట్టుబడులు చూసి కడుపు మంటా..? వాడండి ENO..!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ సై అంటే ప్రతిపక్షాలు నై అంటున్నాయి. తాజాగా దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చింది. అయితే ఈ పెట్టుబడులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలను తిప్పి కొట్టేందుకు వినూత్న ప్రచారానికి తెరలేపారు. కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి నగర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘పెట్టుబడులు చూసి కడుపు మంటా..? వాడండి ENO..!,’ అని పేర్కొంటూ కౌంటర్ ఇచ్చారు. # DigestThe Growth ట్యాగ్ లైన్ లో పెట్టిన హోర్డింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారాయి.