Home Page SliderTelangana

సబిత కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారా?

బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యారు. దీనితో సీనియర్ నేత, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఆమె కుమారునికి నామినేటెడ్ పదవి ఇస్తున్నారని టాక్ వినిపించింది.  ఈ మేరకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని ట్విటర్‌లో తెలియజేశారు. తనకు బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, తనకు పార్టీ మారవలసిన అవసరం లేదన్నారు. అలాంటి ఆలోచన లేదని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.