మైక్రోసాఫ్ట్, ఔట్‌లుక్ సేవలకు అంతర్జాతీయంగా అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. ప్లాట్‌ఫార్మ్‌లు పనిచేయడం లేదని ఔట్‌లుక్‌తో సహా బహుళ సేవలపై ప్రభావం చూపినట్టు మైక్రోసాఫ్ట్ కార్ప్ బుధవారం తెలిపింది. ఐతే… అంతరాయం కారణంగా ప్రభావితమైన వినియోగదారుల సంఖ్యను మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అయితే అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ నుండి వచ్చిన డేటా భారతదేశంలో 3,900 కంటే ఎక్కువ సంఘటనలను, జపాన్‌లో 900 కంటే ఎక్కువ సమస్యలు గుర్తించారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా అంతరాయం కలిగినట్టు తేలింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ యూనిట్ అజూర్ కూడా నెట్‌వర్కింగ్ సమస్య గురించి ట్వీట్ చేసింది.

అంతరాయం సమయంలో, చాలా మంది వినియోగదారులు సందేశాలను మార్పిడి చేసుకోలేకపోయారు. కాల్స్ చేసుకోవడానికి కూడా కుదరని పరిస్థితి. సోషల్ మీడియా సైట్‌లో #MicrosoftTeams హ్యాష్‌ట్యాగ్‌గా ట్రెండింగ్‌లో ఉండటంతో, సేవ అంతరాయాన్ని రిపోర్ట్ చేయడానికి చాలా మంది వినియోగదారులు Twitter వినియోగించుకున్నారు.
మైక్రోసాఫ్ట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా 280 మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. కాల్స్ చేయడానికి, సమావేశాలను షెడ్యూల్ చేయడానికి, వారి వర్క్‌ఫ్లో నిర్వహించడానికి సేవను ఉపయోగించే వ్యాపారాలు, పాఠశాలల కోసం రోజువారీ కార్యకలాపాలలో అంతరాయం కలిగింది. కంపెనీ స్టేటస్ పేజీ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, వన్‌డ్రైవ్ ఫర్ బిజినెస్ ప్రభావితమైన సేవల్లో ఉన్నాయి.

