నీట్ లీకేజీపై సుప్రీంలో విచారణ
ఈ ఏడాది జరిగిన నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నీట్ లీకేజీపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.ఈ మేరకు సుప్రీం ఈ విషయంలో కేంద్రానికి అలాగే NTAకు నోటీసులు జారీ చేసింది.నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలను గుర్తించి సరిచేయాలని సుప్రీంకోర్టు NTAకు సూచించింది. కాగా నీట్ పరీక్ష నిర్వహణలో 0.001% తప్పులున్న చర్యలు తీసుకోవాల్సిందేనని సుప్రీం NTAకు ఆదేశించింది. అయితే ఈ ఎగ్జామ్ కోసం విద్యార్థులు పడ్డ కష్టాన్ని మరచిపోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

