మాస్క్‌ను చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..
కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిలలాడిపోతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్ తొలి 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కొవిడ్ నిబంధనలకు పటిష్ఠంగా అమలు చేస్తూ.. మాస్కును తప్పని సరి చేసింది. అయితే.. ఏది తినాలన్నా, తాగాలన్నా, మాస్కును తీయాల్సిందే.. ఈ క్రమంలో వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదు. అందుకే అక్కడ డిఫరెంట్ ఐడియాతో తయారు చేసిన మాస్కులు దర్శనమిస్తున్నాయి. పక్షి ముక్కు ఆకారంలో తయారు చేసిన మాస్కు అందర్నీ ఆకట్టుకుంటోంది. నోరు తెరిస్తే.. ఆటోమేటిక్‌గా అది కూడా తెరుచుకుంటుంది. నోరు మూసేస్తే.. మూసుకుపోతుంది. చైనాలోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఈ మాస్కు ధరించి ఆహారం తింటుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన సఫీర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు.