Home Page SliderInternational

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెయిల్, యూకే‌లో భారతీయ విద్యార్థి పనే!

ఇంగ్లాండ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఇమెయిల్ పంపాడని ముంబై పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు సదరు విద్యార్థికి లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. ఈమెయిల్ పంపిన విద్యార్థిని గుర్తించినందున, భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఆ వైద్య విద్యార్థి హర్యానాకు చెందినవాడని విచారణలో తేలింది. మెడికల్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నట్టుగా నిర్ధారించారు. బ్రిటన్‌లో విద్యార్ధి చదువు పూర్తయ్యాక, ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మార్చిలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో విద్యార్థి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, సల్మాన్ ఖాన్ తన అధికారిక IDలలో ఒకదానిపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్‌ను కలవాలని, విభేదాలను ఒకసారి పరిష్కరించుకోవాలని లేదా పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఇ-మెయిల్‌ను అందుకున్నాడు. సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన ఓ మైనర్ బాలుడిని ఇటీవల ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.