పారా ఒలింపిక్స్‌లో భారత్ బోణీ
పారిస్‌లో జరుగుతున్నపారా ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. రెండవ రోజున పారా షూటర్ అవనీ లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకం సాధించి భళా అనిపించుకుంది. రాజస్థాన్‌కు చెందిన అవని గత టోక్యో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్యం నెగ్గారు. ఇప్పుడు స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మోనా ఆగర్వాల్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది. దీనితో ఇద్దరికి షూటింగ్‌లో పతకాలు వచ్చినట్లయ్యింది. ఈ మధ్య జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా షూటింగ్‌లోనే ఎక్కువ పతకాలు రావడం విశేషం.

