భారత్ నన్ను క్షమించాలి..పాక్ బ్యూటీ
ప్రపంచ కప్ క్రికెట్ కోసం భారత్‌కు వచ్చిన స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, పాక్ బ్యూటీ జైనాబ్ అబ్బాస్ భారతీయులను క్షమాపణలు కోరింది. దీనికి కారణం తాను గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలే. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో జరిగిన పాక్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. తన మాటలతో, అందచందాలతో బాగానే అందర్నీ ఆకట్టుకుంది. అయితే గతంలో భారత్‌ను,హిందూమతాన్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లు వెలుగులోకి రావడంతో భారత్ అభిమానులు ఆమెకు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. అంతేకాక వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఈమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐటీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటూ సైబర్ సెల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీనితో అరెస్టు చేస్తారని బెదిరిపోయి దేశం విడిచి పారిపోయింది జైనాబ్. దుబాయ్ చేరుకుని అక్కడ నుండి పాకిస్తాన్‌కు పరుగులు పెట్టింది. పాక్ చేరిన తర్వాత బుద్ది తెచ్చుకుని భారతీయులు తనను క్షమించాలంటూ పోస్టు పెట్టింది. తన ప్రాణాలకు ముప్పు లేకపోయినా తన కుటుంబసభ్యులు ఆందోళన చెందడంతో, ఇండియా విడిచి వెళ్లిపోయానని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
