Home Page SliderTelangana

తెలంగాణాలో డీఎస్సీ పరీక్షలు వాయిదా

Share with

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణాలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో నవంబర్‌లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే అనుకున్నట్టుగానే తెలంగాణాలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) వాయిదా పడ్డాయి. తెంలగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. కాగా రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు జరగాల్సివుంది. ఈ మేరకు త్వరలోనే డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.