Home Page SliderNational

ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటోంది-మోదీ విసుర్లు

ఇండియాకూటమిపై ప్రధాని మోదీ మండిపాటు
వెయ్యేళ్ల ధర్మాన్ని కాలరాయలని చూస్తున్నారు
డీఎంకే నేత వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం
దేశాన్ని బానిసత్వంలోకి నెట్టాలనుకుంటున్నారని ధ్వజం

సనాతన ధర్మాన్ని అంతం చేసి, దేశాన్ని వెయ్యేళ్లపాటు బానిసత్వంలోకి నెట్టాలని ఇండియా కూటమి చూస్తోందని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన వివాదం తర్వాత మోదీ తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. ‘ఇటీవల ముంబయిలో ఓ సమావేశం నిర్వహించి, అక్కడ ‘ఘమాండీ’ కూటమిని ఎలా నడపాలనే రాజకీయాలను, వ్యూహాన్ని వారు నిర్ణయించుకున్నారని అనుకుంటున్నాను. హిడెన్ ఎజెండాను కూడా నిర్ణయించుకున్నారని.. భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వ్యూహమని ఆరోపించారు. భారతీయుల విశ్వాసంపై దాడి చేయాలని, వేలాది సంవత్సరాలుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు” అని ప్రధాని దుయ్యబట్టారు.