జియో, ఎయిర్‌టెల్ చార్జీల పెంపు..బీఎస్‌ఎన్‌ఎల్ పై వినియోగదారుల మొగ్గు
జియో, ఎయిర్‌టెల్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలు భారీగా పెంచేయడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. చాలామంది ఈ రెండిటి కంటే బీఎస్‌ఎన్‌ఎల్ మేలనే అభిప్రాయంలో ఉన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కావడం కూడా దీనికి ఒక కారణం. ఈ ధరలు భరించలేమని, దీనిబదులు నెట్‌వర్క్ మారిపోవడమే బెటర్ అని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. జియో రీఛార్జ్ ధరలు కనిష్టంగా రూ.35 నుండి ప్లాన్‌ను బట్టి రూ.600 వరకూ పెరిగిపోయాయి. అంబానీ కుమారుడు అనంత్ పెళ్లి ఖర్చులు మా వినియోగదారుల మీద వేస్తున్నారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవల వేల కోట్ల ఖర్చుతో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

