Home Page SliderNational

మహా కుంభమేళాలో మొబైల్‌ ఫోన్‌కు పవిత్ర స్నానం..

Share with

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌ను నీళ్లలో ముంచి స్నానం చేయించాడు. పైగా అక్కడకు వచ్చే వారంతా తమ ఫోన్లు కూడా ఇలా నీళ్లలో ముంచితే ఫోన్ ద్వారా చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని చెబుతున్నాడు. తన ఫోన్ కూడా చాలా పాపాలు చేసిందని.. దానికి శుద్ధి అవసరమని చెప్పి.. ఆ ఫోన్ ను త్రివేణి సంగమం నీళ్లలో మూడు సార్లు ముంచి లేపాడు. దీంతో అతడి చుట్టు పక్కలున్న జనాలు స్నానాలు చేయడం మాని.. అతగాడు ఘనకార్యాన్ని నోరెళ్ల బెట్టి చూడసాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.