వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ సీరియస్..
మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుండి టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అలాగే కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. మరికాసేపట్లో గుంటూరులో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

