Home Page SliderNationalNews AlertPolitics

రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పిన మోడీ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంచుకున్నారు.