రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ
బీజేపీ రెండో జాబితాలో ఆరుగురికి పార్టీ అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ నుంచి గడ్డం నగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి మాధవనేని రఘునందన్ రావు, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదా రెడ్డి, మహబూబాబాద్ నుంచి అజ్మీరా సీతారామ్ నాయక్ కు పార్టీ అవకాశం కల్పించింది. మొదటి విడతలో పార్టీ 9 మందికి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆరుగురికి అవకాశం కల్పించడంతో ఇక రెండు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మంతోపాటుగా వరంగల్ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

