భవిష్యత్తులో సాగు,తాగునీటి సమస్యలు లేకుండా చేస్తా-రేవంత్
తెలంగాణాలో రానున్న కాలంలో రైతుల సాగునీటి అవసరాలకు,ప్రజల తాగునీటి అవసరాలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.ఈ మేరకు ఆయన శనివారం జలమండలి , ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం..20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై సమీక్ష నిర్వహించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపుపై..సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.దీనికి సంబంధించిన ప్రాజెక్టు వ్యయం, నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.తక్షణమే డిపిఆర్ తయారు చేయించి రెడీ చేయాలన్నారు.

