శంషాబాద్ పోలీసుల అదుపులో..బైక్‌చోరీ ముఠా
శంషాబాద్ ఎస్వోటి, శంషాబాద్ జువైనల్ పోలీసులు కలిసి బైక్ చోరీ చేసే ముఠాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు.
ఈ ముఠా గత 10 నెలలుగా హైదరాబాద్ సైబరాబాద్,రాచకొండ ప్రాంతాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్నారన్నారు.అయితే వీటిలో 44 కేసులు డిటెక్ట్ చేశామని..అదే విధంగా ఈ ముఠాలో ఇద్దరు జువైనల్స్ ఉన్నట్లు గుర్తించాం అన్నారు.వీరిలో ప్రధాన నిందితుడు A1మహ్మద్ అష్వాక్ అలియాస్ ఖబీర్ పాతబస్తీకి చెందిన వ్యక్తి అని,మదీనా సెంటర్‌లో సేల్స్‌మాన్‌గా పనిచేసే వాడని తెలిపారు.ఖబీర్ తన స్నేహితుడు సద్దాంతో కలిసి ఫస్ట్‌టైం హైదరాబాద్‌లో దొంగతనం చేశారన్నారు.ఆ తరువాత మరో నలుగురిని కలుపుకుని మూడు కమిషనరేట్ పరిధిలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడ్డారన్నారు.జీతం సరిపోక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వీరు చోరీ చేసిన బైక్‌లను ఫైనాన్స్ కట్టని బైక్‌లని చెప్పి..వికారాబాద్,నిజామాబాద్,కామారెడ్డి లో వాటిని అమ్మేవారన్నారు.చోరీ చేసిన బైక్‌లను రూ.15వేల నుండి రూ.30 వేల వరకు అమ్మేవారన్నారు.అయితే షాపింగ్ మాల్స్,షాపుల ముందు లాక్ చేయకుండా ఉండే బైక్‌లే వీరి టార్గెట్ అని శంషాబాద్ సీపీ మీడియాకు వెల్లడించారు.