NewsNews AlertTelangana

స్పెషల్ స్కీమ్‌లతో జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం

Share with

జీహెచ్ఎంసీ ఓ సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టింది. ఆస్తి పన్ను స్పెషల్ స్కీములు జీహెచ్ఎంసీకి భారీ ఆదాయన్ని తెచ్చిపెడుతున్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక సంవత్సరం ప్రారభమైన 4 నెలల్లోనే 1000 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసి జీహెచ్ఎంసీ చరిత్ర సృష్టించింది. 2022-23 సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ రూ.2వేల కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఏప్రిల్ నెలలో అమలు చేసిన ఎర్లీబర్డ్ పధకంలో 5 రాయితి తో రూ.741.35 కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘వన్​టైం సెటిల్​మెంట్’​ స్కీమ్ ద్వారా రూ.17 కోట్లు వచ్చాయి. జులై నెలలో జీహెచ్‌ఎంసీ రూ.68.1 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసింది.

ఈ ఆగస్టు నెల 3వ తేదీ నాటికి 1000 కోట్లు వసూళ్లు కాగా ఇందులో కేవలం స్పెషల్​స్కీముల ద్వారా వచ్చిన మొత్తం రూ.757కోట్లు. రెండు నెలలు కిందటి దాకా జీహెచ్ఎంసీ లోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కొన్ని నెలల్లో ఉద్యోగులకు జీతాలు 15వ తేదీ దాటిన పడని పరిస్ధితి. దీంతో కమిషనర్ సహా ఉన్నతాధికారులు అందరు ఆస్తి పన్ను సెకరించడం పైనే దృష్టి పెట్టారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ ​లోకేశ్​కుమార్ ప్రతిరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ విభాగం అడిషనల్ కమిషనర్ అయితే ఏకంగా ఆస్తిపన్ను కలెక్షన్ తీసుకురాని బిల్ కలెక్టర్లకు జీతాలు ఇవ్వబోమని హెచ్చరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదలైన 4 నెలల్లోనే రూ.1000 కోట్ల ఆస్తిపన్ను​వసూలు కావడం జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఆస్తిపన్ను​వసూలులో భాగంగా తెచ్చిన రెండు స్కీములకు ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకు ‘ఎర్లీబర్డ్’నే ఉదాహరణ అంటున్నారు. ఎర్లీబర్డ్ పధకం అమలులో ఏప్రిల్​ ఒక్క నెలలో ద్వారా రూ.740 కోట్లు వచ్చాయని తెలిపారు. అలాగే జులై 17 నుంచి అక్టోబర్​వరకు అమలు చేస్తున్న ‘వన్ టైమ్ సెటిల్ మెంట్’ స్కీమ్ ద్వారా ఇప్పటికే రూ.17 కోట్లు వచ్చాయి వివరించారు. ఏప్రిల్​1 నుంచి జులై 31వరకు రూ.994 కోట్లు వచ్చాయని ఆగస్టు నెల మొదటి 3 రోజుల్లో రూ.6 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇంకా 8 నెలలు సమయం ఉండటంతో ఈసారి పూర్తి స్థాయిలో ఆస్తి పన్ను​వసూలు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ కు ఎటువంటి నిధులు​రావడం లేదని. కనీసం ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను కూడా చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తి పన్ను​పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వలన రాజధాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్న కూడా కమిషనర్​ఈ తరహాలో ఎప్పుడూ టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించలేదని చెప్పుకుంటున్నారు