Home Page SliderPoliticsTelangana

దొరల కాంపౌండ్‌లో చేరి చిలకపలుకులు పలుకుతున్నవ్‌

ప్రగతిభవన్‌లో కొత్తగా చేరిన చిలుకలా పైలట్‌ చిలకపలుకులు పలుకుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై రఘునందన్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. ఉద్యమంలో నుంచి ఎదిగిన నేతగా ఎల్లప్పుడూ ప్రజలకే జవాబుదారీగా ఉంటానన్నాను. ఉద్యమ సమయంలో పటాన్‌చెరులో తాను పైసలు వసూలు చేశానన్న ఆరోపణలపై ఇప్పటిదాకా ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. 2018 ఎన్నికలు ప్రచారంలో దొరలు తిరిగే కారు కావాలా.. అన్నం తినే చేయి కావాలా అని రోహిత్‌ రెడ్డి అడిగిన విషయాన్ని రఘునందన్‌ రావు గుర్తు చేశారు. అన్నం తినిపించిన పార్టీకి సున్నం పెట్టినవ్‌.. బీఫాం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గోదావరిలో ముంచినవ్‌.. నువ్వు తిట్టిన దొరల కాంపౌండ్‌లోనే చేరి ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నవ్‌` అంటూ రోహిత్‌ రెడ్డిపై రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం రోహిత్ రెడ్డికే చెల్లిందన్నారు. రోహిత్‌ రెడ్డికి రాష్ట్రంతో గానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదన్నారు రఘునందన్‌ రావు.