సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు లభించని ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులు చుక్కెదురయ్యింది. 20వ తారీఖు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవిత అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముందుగా నిర్ణయించినట్టుగా పిటిషన్ పై ఈనెల 24న విచారిస్తామంది. ఈనెల 11న విచారణ సందర్భంగా కవితను ఈడీ సుమారుగా 8 గంటలకు పైగా విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి, కవిత నుంచి ఈడీ సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. కవిత గురువారం ఈడీ ముందుకు విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. ఐతే ఆమె హాజరుకాలేదు. ఈడీ ఎప్పుడు పిలిచినా విచారణకు తాను హాజరవుతానన్నారు. దీంతో ఈడీ అధికారులు ఈనెల 20న విచారణకు రావాల్సిందిగా కవితకు సమాచారం పంపించారు.

