కాంగ్రెస్‌లో చిచ్చురేపిన మునుగోడు ఉపఎన్నికలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరనుట్లు ప్రకటించారు. దీంతో మునుగోడులో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారో ఇంకా స్పష్టత రాలేదు. మునుగోడులో ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్‌ను పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ గౌడ్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మునుగోడు ఉపఎన్నిక గురించి కాంగ్రెస్ కార్యకర్తతో పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ టికెట్ విషయంలో ముగ్గురిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కోసం కలిసి పనిచేయాలని సూచించింది. ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు గాంధీ భవన్‌లో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. టికెట్ కోరుకునే వారు గాంధీ భవన్‌కు రావాలని పార్టీ పిలుపునిచ్చింది.
మాణిక్యం ఠాగూర్ ఈ సమావేశం నిమిత్తం ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు హాజరయ్యారు.