Home Page SliderTelangana

నన్ను క్షమించండి.. తెలియక తప్పు చేసాను..

ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత దాదాపు తెలుగువారికి సుపరిచితమే. తాజాగా ఆమె హోలీ సందర్భంగా అభిమానులకు విషెస్ తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. అసలు ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పిందంటే.. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు సోషల్ మీియాలో బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీత సైతం తాను కూడా తెలిసో, తెలియక బెట్టింగ్ ప్రమోట్ చేశానని తెలిపింది. ఇక నుంచి అలా చేయనని.. మీరందరూ కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఎవరూ కూడా అలాంటి యాప్స్ ను ఎంకరేజ్ చేయొద్దు.. ఈజీ నీకి అలవాటు పడొద్దని వీడియోలో పేర్కొంది.