ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి..
నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న జాల మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకొని, తనని వేధింపులకు గురిచేస్తున్నాడని ఎస్ఐ భార్య జ్యోతి ఇవాళ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగింది. పిల్లలతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వా లని కోరుతూ విన్నూత నిరసన తెలిపింది. ప్రియురాలితో కలిసి తన భర్త పలుమార్లు తనపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది. వివాహిత ముగ్గురు పిల్లల తల్లి అయినా ఎక్సైజ్ కానిస్టేబుల్ తో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. తనను చంపివేస్తానని వేధిస్తూ ఉండడంతో రోజు నరకయాతన భరించలేపోతున్న.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. తన భర్త అతని ప్రియురాలి చేతిలో చనిపోయే దానికన్నా ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండంటూ ప్లెక్సీతో నిరసన చేపట్టింది. నాకు, నా పిల్లలకు అన్యాయం చేసిన భర్త మహేందర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని బాధితురాలు జ్యోతి మీడియా ముందు తన బాధను తెలియజేసింది.


 
							 
							