Home Page SliderTelangana

రోడ్డు స్థలంలో ఇల్లు కడితే భారీ మూల్యం చెల్లించాల్సిందే..

తెలంగాణలో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని వందనపురి కాలనీలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి ఇంటిని నిర్మించాడని హైడ్రా అధికారులు గుర్తించారు. ఆర్ఎస్ నెం. 848 లో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో స్థానికులు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని హైడ్రా అధికారులకు తెలిపారు. ఫిర్యాదు పై స్పందించిన హైడ్రా .. రంగంలోకి దిగి రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఇంటిని జేసీబీలతో కూల్చారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయటంతో కాలనీ సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.