లగేజ్ పేక్‌చేస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఇంతకీ ఏ ఊరికో..!
దొరసాని సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సినిమాల్లోకి వచ్చింది యాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక. ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో రంగమార్తాండ, పంచ తంత్రం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్న ఈ భామ రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లింది. లేజీ గర్ల్ గైడ్ చేసేందుకు రెడీగా ఉంది. మీ బేగ్‌లను సర్దుకోండి.. సంధ్యాసమాయాలను ఫాలో అవ్వండి.. చక్కని ఫొటోలు తీయండి. మనసులో ఉన్న ఫొటోలు మీ జ్ఞాపకాలలో పదిలంగా ఉండిపోతాయి.. అంటూ బేగ్ సర్దుకున్న ఫొటోలతోపాటు వెకేషన్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతుండగా.. ఇంతకీ శివాత్మిక ఎక్కడికెళ్లిందనేది సస్పెన్స్‌లోనే ఉంది.