71రోజుల్లో 84 కాల్స్ ఉంటే అరెస్ట్ చేస్తారా?
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అప్పీల్ చేసిన క్వాష్ పిటీషన్ సందర్భంగా ఆసక్తికర వాదనలు వినిపించాయి. దాడి రోజున ఏ2గా ఉన్న భోగమోని సురేష్…..మాజీ ఎమ్మెల్యేతో ఎక్కువ సార్లు ఫోన్ టచ్ లో ఉన్నారన్న నెపంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.కొండగల్ కోర్టు న్యాయమూర్తి వెంటనే రిమాండ్ విధించారు.దీన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ పిటీషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తరుఫున న్యాయవాది ఆసక్తికర వాదనలు వినిపించారు. 71 రోజుల్లో 84 సార్లు సురేష్,నరేందర్ మధ్య ఫోన్ కాల్స్ నడిచాయన్న కారణంతో అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు.సుప్రీం కోర్టు తీర్పులను కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు జడ్జికి తెలిపారు. కేసుతో ఎలాంటి సంబంధంలేకపోయినా అరెస్ట్ చేశారని,ఆ సమయంలో కుటుంబీకులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.

