Andhra PradeshNews

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది:సీఎం జగన్‌

ఆళ్లగడ్డలో 50.92 లక్షల మంది రైతులకు రూ.2,096.04 కోట్లు విడుదల

ప్రతి అంశంలో రైతులకు అండగా ఉంటున్నామని,ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని,రైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆళ్లగడ్డలో డాక్టర్ వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మన్ పథకం కింద రెండో విడతగా 50.92 లక్షల మంది రైతులకు రూ.2,096.04 కోట్ల నగదు ను సీఎం జగన్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాలెండర్‌ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నామని
రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉందని 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉందని ,రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామని అన్నారు. మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందిస్తున్నామని,ఎక్కడా లంచాలుకు తావు లేదని పేర్కొన్నారు

ఇప్పటికే మేలో రూ. 7500 జమ చేసామని ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తున్నామని, మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర రైతులకు లబ్ది చేశామని వివరించారు.మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామని ,ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ. 51 వేలు అందించామని, పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించామని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. తాము చేసిన మంచి పనులు ఎల్లో మీడియాలో రావని,ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయిందని,ఒక వ్యక్తికి అధికారంలోకి రావాలని కుతంత్రాలు పన్నుతున్నారని గతంలో డీపీటీ పథకం.. దోచుకో, పంచుకో, తినుకో అని,ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్‌ బెనఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ అని వివరించారు.

గజదొంగల ముఠా మంచిని చెప్పదని కుట్రలే చేస్తుందని,అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు,ఆయన దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించాలనీ ,అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేదని,ఈరోజు అందరి జీవితాలు బాగున్నాయా.. లేదా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని,తమ ప్రభుత్వంతో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. సున్నా వడ్డీ కింద చంద్రబాబు రూ. 685 కోట్లు చెల్లిస్తే,మూడున్నరేళ్లల్లో సున్నా వడ్డీ కింద తాము రూ. 1,282 తకోట్లు చెల్లించామని బాబు హయాంలో బ్యాంకుల ద్వారా రూ. 3.6 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు రూ. 5.48 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని,44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,684 కోట్ల బీమా సొమ్ము జమ చేశామని,ఏరైతు నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామనీ అన్నారు. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని,భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రజలందరి ఆశీస్సులు తమపై ఉండాలని ముగించారు.