కేసీఆర్ గెలిస్తే.. బస్తీ దవాఖానాలే సూపర్ స్పెషాలిటీలు కావొచ్చేమో!
తెల్లారి లేచిన దగ్గర నుండి రాత్రి ఏడు గంటల దాకా డాక్టర్లు ఉంటున్నారు. దగ్గు, జ్వరం, షుగర్, బీపీ గోలీలు ఫ్రీగా ఇస్తున్నారు. గర్భిణీలకు టెస్టులు, బలం ట్యాబ్‌లెట్లు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఓపిక లేకపోతే ఫోన్ చేస్తే ఫోన్‌లోనే ఏ మందులు వాడాలో చెప్తున్నారు. బస్తీ దవాఖానాలు వచ్చినాక పొద్దంతా దవాఖానా చుట్టూ తిరిగే పనిలేదు, హాయిగా డాక్టర్లు ఖర్చు లేకుండా పేదలను ఆదుకుంటున్నారు. లేదంటే.. ప్రైవేట్ డాక్టర్ పోవాలి, అక్కడికి పోతే పైసల ఇబ్బంది ఉండేది. ఇప్పుడు జ్వరంవస్తే బస్తీ దాటాల్సిన అవసరమే లేదు. ఈసారి కూడా కేసీఆర్ సార్ గెలిస్తే.. బస్తీ దవాఖానాలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారుతాయేమో చూద్దాం. నాకైతే ఆయనే హ్యాట్రిక్ సాధిస్తాడనిపిస్తోంది.

