Andhra PradeshHome Page SliderTelangana

కమ్మలంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే, మరి గాంధీ పరిస్థితో?

అయితే ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరటం వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండటంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఏపీ నేపథ్యమున్న ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చూపించే మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలపై గణనీయంగా ఉంటుంది. వాటితోపాటు గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉన్నప్పటికీ… రెండు నియోజకవర్గాలు, ఇప్పుడు కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎవరి రాజకీయాలు వారు చూసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో దెబ్బతింది. దీంతో తాజా ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీ కూడా చేయకుండా ఏపీపైనే మెయిన్ ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయం తెలంగాణలోని కూకట్‌ప్లలి, శేరిలింగంపల్లిపై స్పష్టంగా పడే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మంది మెజారిటీ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొడతామని బాహాటంగా చెబుతున్నారు. వారందరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు బీజేపీ కారణమని ఆరోపిస్తూ… కుట్రలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందని ఫీలవుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు తమకు మద్దతివ్వలేదన్న ఆక్రోశం వారిలో ఉంది. అయితే వాస్తవానికి కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదన్న విషయాన్ని మాత్రం వారు పట్టించుకోవడం లేదు. ఆంధ్రా మూలాలున్న ఓటర్లు కొందరైనా తమకు మద్దతిస్తారని… కొందరు కాంగ్రెస్ నేతలు బాబు అరెస్టుపై మాట్లాడారు తప్పించి కీలక హస్తం పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. ఇందుకు కారణం చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే.