NewsTelangana

ఈడీని వాడితే మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరు…

Share with

బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అన్నారు. మోత్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామని… అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందన్నారు. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని సంజయ్‌ అన్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి నాతో టచ్‌లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని… ఆయన చాలా మంచి పొలిటికల్‌ లీడర్‌ని బండి సంజయ్‌ చెప్పారు.