Home Page SliderTelangana

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆగమాగం అయిపోతాం: సీఎం కేసీఆర్

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ జడ్చర్లలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కాగా ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..జడ్చర్లలో ఇకపై కరువు అనే మాట ఉండదు అన్నారు. కాగా పాలమూరు పాలు గారే జిల్లా అవుతుందన్నారు.ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచి కేవలం 5 గంటల మాత్రమే కరెంటు ఇస్తామని ప్రకటించారన్నారు. అసలు రైతులకు 24 గంటలు అవసరం లేదని రోజుకు 3 గంటలు ఇస్తే చాలని ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ పోయి ఆగమాగం అయిపోతామని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాగా దేశం మొత్తంలో నిరంతరాయంగా కరెంట్ ఇస్తోంది ఒక్క తెలంగాణాలోనే అని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏది నిజమో?ఏది కాదో ప్రజలే ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు.