NewsTelangana

నిలుస్తాం.. గెలుస్తాం… షర్మిల పంతం

Share with

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. తెలంగాణలో ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు మారతాయన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేదని… సమయానికి ఎన్నికలు జరుగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదన్న షర్మిల… సింగిల్‌గానే పోటీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల పక్షంగా నిలబడే ఏకైక పార్టీ తమదేనన్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నాయని అడుగడుగునా రుజవవుతోందన్నారు. పాదయాత్ర ద్వారా లక్షల మందిని కలిశానన్నారు. రాష్ట్రం చుట్టి వచ్చే వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని… తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారన్నారు. ఐదేళ్లపాటు వైఎస్సార్ సువర్ణ పరిపాలన అందించారన్నారు. హైదరాబాద్‌లో రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించడానికి సెంట్ భూమి ఇవ్వలేదని…కేవలం వైఎస్ తెచ్చిన అధికారాన్ని అనుభవించారన్నారు. చనిపోయిన వ్యక్తి పై కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఎందుకునమ్మాలన్నారు షర్మిల. సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ కోసం 40 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికారన్నారు. సబితా ఇంద్రారెడ్డి,దానం నాగేందర్‌కి రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం లేదా అని షర్మిల ప్రశ్నించారు. రేవంత్ ఓటుకు నోటు దొంగ అన్న షర్మిల ఆయన మాటలు ఎవరు నమ్ముతారన్నారు.