వారెవరినీ ఇండియాకు వెళ్లనివ్వను..కోటీశ్వరులు అమెరికాలోనే ఉండాలి: ట్రంప్
తిక్క తిక్క పనులతో అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ వార్తల్లో నిలిచిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు తాను చేసుకున్న కర్మము నుంచి బయటపడాలని భావిస్తున్నాడు. అందుకే నాడు వలసదారుల్ని వెల్లగొట్టేస్తాను, అమెరికా, అమెరికన్ల కోసమే అంటూ భీష్మించిన పెద్ద మనిషి, ఇప్పుడు అమెరికా కాలేజీల్లో చదివితే చాలు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానంటున్నాడు. ఇక అమెరికాలోనే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చేస్తున్నాడు. అమెరికా కాలేజీల్లో చదువుకొని, అక్కడ డబ్బు సంపాదించి, ఆ దేశ సంపదను మాతృదేశాలకు తీసుకెళ్లిపోవడం వల్ల తమకు పెద్ద బొక్క అని తెలుసుకున్నానంటున్నాడు. అందుకే ఇప్పుడు అమెరికాలో రెండేళ్ల డిగ్రీ చదివినా సరే, గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానంటున్నారు డోనాల్డ్ ట్రంప్. ఇమ్మిగ్రేషన్‌పై వైఖరిని సులభతరం చేస్తూ, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్‌లను అందజేస్తానని హామీ ఇచ్చాడు. అమెరికా కాలేజీల్లో చదువుకున్న వారు మల్టీ బిలియనీర్లుగా మారి భారతదేశం, చైనా, ఇతర స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా నిరోధిస్తానంటున్నాడు. వలసదారుల వ్యతిరేకంగా వ్యవహరించే ట్రంప్ ఈసారి ఆ లైన్ మార్చాడు.

నవంబర్ అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఇమ్మిగ్రేషన్-అక్రమ వలసదారుల బహిష్కరణ వ్యవహారంలో కొత్త వర్షన్ విన్పిస్తున్నాడు. అయితే ట్రంప్ మొదట్నుంచి మెరిట్ ఆధారిత చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మద్దతు ఇస్తూనే ఉన్నారని కూడా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. “నేను ఏమి చేయాలనుకుంటున్నంటే, మీరు కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్, డిప్లొమా చదువుకుంటే, అలాంటివారందరూ గ్రీన్ కార్డ్ పొందాలని నేను భావిస్తున్నా. ఈ దేశంలో ఉండేందుకు గ్రీన్ కార్డ్ ఇస్తాం ” అని 78 ఏళ్ల ట్రంప్ చెప్పాడు. గ్రీన్ కార్డ్‌ను, అధికారికంగా శాశ్వత నివాసి కార్డ్ అని పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో ఒక వ్యక్తికి శాశ్వత నివాసం ఉన్నట్లు చూపే గుర్తింపు పత్రం. ట్రంప్ కార్యక్రమాన్ని నలుగురు వెంచర్ క్యాపిటలిస్టులు చమత్ పలిహపిటియా, జాసన్ కాలకానిస్, డేవిడ్ సాక్స్, డేవిడ్ ఫ్రైడ్‌బర్గ్ హోస్ట్ చేసారు. వీరిలో ముగ్గురు వలసదారులు కావడం విశేషం. “ప్రపంచంలోని అత్యుత్తమ ప్రకాశవంతమైన వాటిని అమెరికాకు దిగుమతి చేసుకునేందుకు మీరు మాకు మరింత సామర్థ్యాన్ని ఇస్తారని మాకు వాగ్దానం చేయండి” అని ఓ వ్యాఖ్యత కాలకానిస్ ఒత్తిడి చేయడంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రిపబ్లికన్ పార్టీ నుండి ఊహించిన అభ్యర్థి అయిన ట్రంప్ కూడా “ప్రజలు ఒక ఉన్నత కాలేజీ పట్టభద్రులైన వారు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. వారు ఒక కంపెనీ కోసం ఒక ప్రణాళికను ప్రారంభించాలనుకుంటారు. కానీ వారు చేయలేరు. వారు భారతదేశానికి తిరిగి వెళతారు, వారు చైనాకు తిరిగి వెళతారు, వారు ఆయా దేశాల్లో కంపెనీలు పెడుతున్నారు” అని చెప్పాడు. వారందరూ వందల వేల మందికి ఉపాధి కల్పిస్తూ బహుళ-బిలియనీర్లు అవుతారు. కానీ అది అమెరికాలో మాత్రం ఉండటం లేదన్నాడు. STEM (సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ ఇంజనీరింగ్) రంగంలో ఉన్నత విద్యా సంస్థ నుండి డిగ్రీ పొందిన తరువాత విదేశీ విద్యార్థులు గ్రీన్ కార్డ్ పొంది, అమెరికాలోనే ఉండాలని, అక్కడ ఉంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది తన ఉద్దేశమని చెబుతున్నాడు. “మేము తెలివైన వ్యక్తులను, కాలేజీల నుండి గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తులను, ఉత్తమ కళాశాలల నుండి వారి తరగతిలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులను మేము బలవంతం చేస్తాము, మీరు ఈ వ్యక్తులను నియమించుకోగలగాలి, ప్రజలకు అకాశాలివ్వాలని” అని ట్రంప్ తేల్చి చెప్పాడు.

