డ్రగ్స్ టెస్ట్‌కు రక్తంతో పాటు కిడ్నీ కూడా ఇస్తా..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే… కేంద్ర ప్రభుత్వం తమపైకి వేట కుక్కలను వదులుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ చేసిన డ్రగ్స్ విమర్శలపై కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ టెస్ట్ కోసం రక్తం ఇచ్చేందుకు తాను సిద్ధమని.. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానన్నారు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే… కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలకు సిద్ధమా? అని బండికి కేటీఆర్ సవాల్ విసిరారు. కోడె మొక్కుల దేవుడిపై సంజయ్‌కు నిజంగా ప్రేమ ఉంటే వేములవాడ గుడికి 500 కోట్ల నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కరీంనగర్‌కు అసలు ఏం చేశారో చెప్పాలన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే ఓట్లు రావని, పద్ధతి మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

