జరిగిన తప్పులను దిద్దడానికే నాకు అవకాశమిచ్చారు-రిషి
ఇంగ్లాండ్ దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందన్నారు కొత్త ప్రధాని రుషి సునక్. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమయంలో లిజ్ ట్రస్ కొన్ని అసంబద్ధ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చేసిన తప్పులను దిద్దేందుకు ప్రధానిగా తనకు అవకాశమిచ్చారన్నారు రిషి. ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లను అస్థిరపరిచిందందన్న సునక్… మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌ను అభినందిస్తున్నానన్నారు. కొన్ని తప్పులు జరిగాయని.. అవి చెడు ఉద్దేశ్యంతో చేసినవి కాదని… ఐనా వాటి వల్ల ఎంతో నష్టం కలిగిందన్నారు. కింగ్ చార్లెస్‌ని కలిసిన తర్వాత సునక్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరిదిద్దడానికి నన్ను పార్టీ పెద్దలు ఎన్నుకున్నారన్నారు. దేశాన్ని మాటలతో కాదు, చర్యలో ఒక్కటి చేస్తానన్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పగలు, రాత్రి నిరంతరం పని చేస్తాననన్నారు. ప్రజల నమ్మకం సంపాదిస్తానన్నారు. దేశ ప్రజలందరినీ ఏకం చేస్తానన్నారు. ప్రజల గుండెలో మేనిఫెస్టో ఉందన్నారు సునక్. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన రుషి సునక్ కు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.

