Home Page SliderTelangana

రైతుల కోసమే పార్టీ మారాను..పోచారం శ్రీనివాసరెడ్డి

రైతుల కోసమే పార్టీ మారాను అని కాంగ్రెస్‌లో చేరిన బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  నేను రైతు బిడ్డను. నేను ఆరు మాసాలుగా కొత్త ప్రభుత్వాన్ని చూస్తున్నాను. చిన్న వయస్సులోనే ధైర్యంతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను. నేను గతంలో వ్యవసాయమంత్రిగా కూడా చేశాను. రైతుల మేలు కోసమే నేను పార్టీ మారాను. గతంలో కూడా బీఆర్‌ఎస్ పార్టీ కంటే ముందు తెలుగుదేశంలో, అంతకు ముందు కాంగ్రెస్‌లో ఉన్నాను. ఎవరు ప్రజలకు మంచి చేస్తే వారి పక్షం వహిస్తాను. పనిచేసే రేవంత్‌రెడ్డి వంటి నాయకులను ఆశీర్వదిస్తున్నానని పేర్కొన్నారు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసమే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.