News Alert

అభివృద్ధి చూసి ప్రధానిగా గర్వపడుతున్నా

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో రెండు రోజుల సెంటర్-స్టేట్ సైన్స్ క్లాన్ కేవ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ 46వ స్థానానలో ఉందని .. 2015లో 81వ స్థానంలో ఉండగా.. అతి తక్కువ కాలంలో 25 స్థానాలు ఎగబాకిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి ఎంతో గర్వపడుతున్నానన్నారు నరేంద్రమోది.

దేశాన్ని ప్రపంచ శాస్త్ర, సాంకేతిక కేంద్రంగా నిర్మించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలన్నారు. శాస్త్ర వేత్తలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లను అవసరం మేరకు నిర్మించడంలో రాష్ట్రాలు తమ వంతు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. 2014 తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. అన్ని రంగాల్లో భారత్ ను పరిశోధన, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.

అందరికీ అందుబాటులో వ్యవసాయం, గృహలు, ఆర్థిక వృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్నారు. జై జవాన్, జై కిషన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదంతో నేటి నయా భారత్ ముందుకు సాగుతుందన్నారు. నేడు భారత్ నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించే దిశగా దేశం దూసుకెళ్తోందన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలను పండుగగా జరుపుకున్నప్పుడు సైన్స్ మన సమాజంలో సంస్కృతిలో భాగమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.