home page sliderHome Page SliderTelangana

పాతబస్తీలో హైడ్రా .. స్థానికుల నిరసనలు

హైదరాబాద్ – చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో అక్రమంగా నిర్మించిన షాపులపై హైడ్రా కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేశారు. హైడ్రా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.