భారీ వరదలతో హైదరాబాద్-బెంగళూరు రాకపోకలు బంద్
అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోం ది. వరద పోటెత్తడంతో వాగుకు ఇరువైపులా ఉన్నకాలనీలు పూర్తిగా నీటమునిగాయి. కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. పండమేరు వాగు ఉధృతితో హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.


 
							 
							