Home Page SliderNational

భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య..

భార్య వేధింపులు భరించలేక 40 పేజీల లేఖ రాసి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. అతుల్‌ సుభాష్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య ముందు ఆయన ఏకంగా 40 పేజీల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నారు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్‌ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. తన నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మంగళవారం పోలీసులు గుర్తించారు.

భర్త అతుల్ తో గొడవపడిన భార్య యూపీలోని ఆమె పుట్టింటికి వెళ్ళి అక్కడ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు.. ఆమెతోనే కలిసి జీవించేందుకు అతుల్ చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.