Home Page SliderInternational

ఇకపై డ్రోన్లలో మానవుల షికారు..చైనా

చైనా డ్రోన్ల తయారీలో వేగంగా పురోగతి సాధిస్తోంది. తాజాగా డ్రోన్లలో మానవులను, సరుకులను తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. అతి పెద్ద రవాణా డ్రోన్‌ను పరీక్షించింది. ఇది ఏకంగా 2 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. దీనితో ప్రపంచంలోనే డ్రోన్ల తయారీ, విక్రయాలలో చైనా ముందంజలో ఉంది. ఇది సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారు చేసింది. ఇది రెండు ఇంజన్లతో పనిచేస్తుంది. దీనిని సిచవాన్ ప్రావిన్స్‌లో పరీక్షించగా దాదాపు 20 నిముషాలు ప్రయాణించింది.

పూర్తిగా ప్రభుత్వ నిధులతో తయారయిన ఈ డ్రోన్ ఎత్తు 15 అడుగులు కాగా, రెక్కల పొడవు 16 మీటర్లు. గతంలో చైనా ఏవియేషన్ కార్పొరేషన్ తయారుచేసిన HH-100 అనే కార్గో డ్రోన్ 700 కేజీల బరువుతో 520 కిలోమీటర్లు ప్రయాణించింది. 2030 నాటికి లోఆల్టిట్యూడ్ ఎకానమీ వ్యవస్థ నాలుగురెట్లు పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ డ్రోన్‌లలో మానవులను చాలా తేలికగా ఒక చోట నుండి మరోచోటకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతానికి చైనాలో రెండువేల సంస్థలకు పైగా డ్రోన్ల తయారీ, డిజైన్‌ రంగంలో పనిచేస్తున్నాయి.