గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
హైదరాబాద్‌లో మంగళవారం గణేష్ నిమజ్జనం జరగనుంది. ఈ కార్యక్రమం సాఫీగా జరగాలని పోలీసులు పక్కా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటలోగా ఖైరతాబాద్ గణేషుడిని, నాలుగు గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగబోతోందని పోలీసులు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్స్ ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం జరిగే ఏర్పాటు చేశామన్నారు.

