NewsNews AlertTelangana

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్‌రెడ్డి క్షమాపణ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బేషరతు క్షమాపణ చెప్పారు. ఇటీవల పత్రికా సమావేశంలో… హోం గార్డ్ ప్రస్తావన చేశానన్న రేవంత్… మునుగోడు సభలో అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం ఉపయోగించడంతో… కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మనస్థాపానికి గురయ్యారన్నారు. మొత్తం వ్యవహారంపై… పీసీసీ చీఫ్‌ క్షమాపణ చెప్పాలని కోరినందున… బేషరతుగా సారీ చెప్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి వ్యక్తి సేవలు కాంగ్రెస్‌ పార్టీకి అవసరమన్నారు. సీనియర్ నేతలపై ఇష్టానుసారంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా తప్పు తప్పేనన్నారు. అద్దంకి కేసును పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డికి అప్పగిస్తానని, ఆయనపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

అద్దంకిని సస్పెండ్‌ చేయాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అయితే.. రేవంత్‌రెడ్డి క్షమాపణను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేలికగా కొట్టి పారేశారు. తనకంటే జూనియర్‌ అయిన అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. రేవంత్‌రెడ్డి క్షమాపణపై అప్పుడే స్పందిస్తానని, ఆ తర్వాతే మునుగోడు ప్రచారానికి వెళ్తానని స్పష్టం చేశారు. దీంతో కీలకమైన మునుగోడు ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్‌ నేతలు ఇంటిపోరులోనే కొట్టుమిట్టాడుతున్నారు.

కోమటిరెడ్డికి సారి చెప్పిన రేవంత్ రెడ్డి || Revanth Reddy Apologizes || #shorts – YouTube