కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? మీకు తెలుసా?
వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. సోడియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచి, ఆరోగ్యం కూడా ఇచ్చే ఈ నీళ్లు అసలు కొబ్బరి బొండంలోకి ఎలా చేరుతాయి? సుమారు 60 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు పెరిగే కొబ్బరి చెట్టు వేళ్ళ ద్వారా ఆకులకు పోషకాలు అందిస్తాయి. ప్రతి సారి పోషకాలను సేకరించాలంటే కొమ్మలకి కష్టమవుతుంది. కాబట్టి ఆకులకు దగ్గరగా ఉండేలా కొబ్బరి బొండాలు నీటిని నిల్వ చేసుకుంటాయి. పోషకాలు అవసరమైనప్పుడు కొమ్మలు సిగ్నల్స్ పంపిస్తుంటాయి. ఆ తర్వాత వేర్లు పోషకాలను సేకరించి కాండంలోని మైక్రో ట్యూబ్స్ ద్వారా కొమ్మలకు చేరుస్తాయి. అలా చేరిన పోషకాలు నీటిని కొమ్మలు సేకరించి కాయల్లో నిల్వ చేసుకుంటాయి. అలా కొబ్బరి బొండల్లో నీళ్లు ఏర్పడతాయి.

