Home Page SliderTelanganatelangana,

ఫోన్ ట్యాపింగ్ కేసులో అతనికి బెయిల్ రద్దు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసింది నాంపల్లి కోర్టు. గురువారం సాయంత్రం 4 గంటలలోపు జైలుకు వెళ్లాలంటూ భుజంగరావును ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగస్టులో ఆయనకు ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇచ్చి, దానిని పొడిగిస్తూ వచ్చారు. అయితే గత నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకరరావు అమెరికాలో ఉన్నారని, ఇటీవలే ఆయనకు గ్రీన్ కార్డు కూడా రద్దు చేశారని సమాచారం. ఈ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతో పాటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులు జైలులో ఉన్నారు.