హిజ్రా లీడర్ దారుణ హత్య
నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారుణం జరిగింది.ఓ హిజ్రా లీడర్ ని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హిజ్రా నాయకురాలు హాసిని ని రెండు కార్లలో వచ్చి కత్తులతో పొడిచి పరార్ అయ్యారు. స్థానికులు సాయంతో తీవ్ర రక్తస్రావమోడుతున్న క్షతగాత్రురాలిని 108లో నెల్లూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హిజ్రా చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి.. తిరిగి వస్తుండగా దుండగులు దారి కాచి దాడి చేశారు. హాసిని కి తిరుపతి – నెల్లూరులో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ జండర్స్ మద్దతుదారుల ఫాలోయింగ్ ఉంది. ఈ ఘటనపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

