Andhra PradeshHome Page Slider

ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజును తొలగించిన హైకమాండ్

బీజేపీ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పార్టీలోని ప్రముఖ నేతలు ఇప్పటికే పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజును హైకమాండ్ తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ మేరకు రాజీనామా చేయాలని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా సోమువీర్రాజుకు ఫోన్ చేసి చెప్పినట్లు  తెలుస్తోంది. అయితే కేంద్రంలో వీర్రాజుకు కొత్త బాధ్యతలు అప్పగిస్తానని నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా సోమువీర్రాజు స్థానంలో బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. అయితే సత్యకుమార్‌ను పార్టీ సారథిగా నియమించడంపై సాయంత్రం అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.