Home Page SlidermoviesNational

కుక్కపిల్ల కారణంగా హీరోయిన్  ప్రేమ-పెళ్లి

కన్నడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన హరిప్రియ కన్నడ నటుడు వశిష్టను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరు తాజాగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. తమ వివాహానికి కారణం తమ కుక్కపిల్లలే అంటూ మీడియాతో పంచుకుంది హరిప్రియ. తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించింది. వీటిలో నానితో నటించిన ‘పిల్ల జమీందార్’, బాలకృష్ణతో నటించిన ‘జై సింహా’లో ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. ‘తకిట తకిట’, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో ‘జై సింహా’ తర్వాత నటించక పోయినా, కన్నడలో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసింది.

తన దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్కపిల్లలు ఉండేవని, వాటిలో లక్కీ అనే కుక్క చనిపోవడంతో హ్యాపీ ఒంటరిదైపోయిందని పేర్కొంది. అలాంటి సమయంలో హీరో వశిష్ట తనకు క్రిస్టల్ అనే కుక్కపిల్లను ఇచ్చి హ్యాపీని హ్యాపీ చేశాడని చెప్పింది. దీనితో వారిద్దరూ స్నేహితులమయ్యామని, తర్వాత అదే ప్రేమ, పెళ్లికి కారణమయ్యిందని పేర్కొంది.