Home Page SliderTelangana

డ్రగ్స్ కేసులో ఏ10గా ప్రముఖ హీరోయిన్ సోదరుడు

హైదరాబాద్ నార్సింగి పోలీసులు డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా ఈ కేసులో మరో 30 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు.నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారులు, బడాబాబులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ఏ10గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.