హైదరాబాద్‌లో భారీ వర్షం
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్ ఏరియాల్లోనూ మోస్తరు వానలు పడుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.


 
							 
							